News February 9, 2026

పిల్లల SM వాడకంపై నియంత్రణకు ప్రణాళికలు: CBN

image

AP: పిల్లలకు సోషల్ మీడియా నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు CM చంద్రబాబు తెలిపారు. మంత్రులు, కార్యదర్శులు, శాంతి భద్రతలపై DGP, SPలతో సమావేశమయ్యారు. ’16 ఏళ్లలోపు పిల్లలు SM వాడకాన్ని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి’ అని సూచించారు.

Similar News

News February 22, 2026

సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

image

హీరోయిన్ సాయిపల్లవి అరుదైన ఘనత సాధించారు. పదేళ్ల వ్యవధిలో 3 భాషల్లో ఏకంగా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న నటిగా నిలిచారు. 2015లో ప్రేమమ్(మలయాళం) చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగులో ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, తమిళంలో గార్గి, అమరన్(లేటెస్ట్) సినిమాలకు ఉత్తమ నటిగా, విరాటపర్వం మూవీకి ఉత్తమ నటి(క్రిటిక్స్) పురస్కారాలు పొందారు.

News February 22, 2026

IIT తిరుపతిలో ఉద్యోగాలు

image

ఐఐటీ తిరుపతి ఇన్‌స్టిట్యూట్ కౌన్సెలర్(2), సైకోమెట్రిక్ నర్స్ (1)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MPhil(క్లినికల్ సైకాలజీ), MSc/BSc(సైకియాట్రిక్ నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్/రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iittp.ac.in

News February 22, 2026

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించడం

image

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించే విధానాన్ని పంట ఏ దశలోనైనా అనుసరించవచ్చు. బర్రో ఫ్యూమిగేటర్‌ ద్వారా ఎలుకలు ఉండే కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. అయితే పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేయాలి. పొగను కనీసం మూడు నిమిషాలు వదలాలి. ఇలా చేస్తే ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించవచ్చు. తదుపరి సీజన్‌లో వాటి ఉద్ధృతిని తగ్గించవచ్చు.