News February 9, 2026

తిర్యాణిలో మావోయిస్టుల కదలికలు!

image

తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. డోర్లి-పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, సామగ్రిని గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News April 18, 2026

WGL: రూ.2.5 కోట్ల మోసం.. మిర్చి వ్యాపారి అరెస్ట్

image

ఏనుమాముల మార్కెట్‌లో అడ్తిదారులను మోసం చేసిన మిర్చి వ్యాపారి లడే తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రి చిల్లీస్ పేరిట వ్యాపారం చేస్తూ 49 మందితో మిర్చి కొనుగోలు చేసి, అదే సరకును ఇతరులకు విక్రయించి సుమారు రూ.2.5 కోట్లతో పరారయ్యాడు. ఈ నెల 2న విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. దేశాయిపేట వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఆయన భార్య మాధవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

News April 18, 2026

విశాఖలో ఒక్కరోజే 2,430 కేసులు నమోదు

image

విశాఖలోని శుక్రవారం ఒక్కరోజే 2,430 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,137, పిలియన్ రైడర్-223, ట్రిపుల్ రైడింగ్- 82, ఓవర్ స్పీడ్-220, సెల్ఫోన్ డ్రైవింగ్-28, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-15, మైనర్ డ్రైవింగ్ 03, రాంగ్ పార్కింగ్-180, డ్రంకన్ డ్రైవింగ్-35, సీజ్ అయిన వెహికల్స్-43, ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-547 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయగా 20 బస్సులు తనిఖీ చేశారు.

News April 18, 2026

అనంత: RDT గుడ్ న్యూస్

image

ఉమ్మడి అనంత జిల్లా ప్రజలకు RDT తీపి కబురు చెప్పింది. 2004లో పేద పిల్లల కోసం ఆ సంస్థ ప్రవేశపెట్టిన విద్యా పథకాన్ని పున:ప్రారంభించేందుకు నిర్ణయించారు. పథకంలో కొన్ని మార్పులు చేసి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింది ఇప్పటి వరకు 5,400 మంది విద్యార్థులు చదువుకున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాగానే ప్రకటన చేయనున్నట్లు సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు.