News February 9, 2026
నియోజకవర్గాలకు ర్యాంకులు.. విజయవాడ వెస్ట్ టాప్

AP: MLAల పనితీరు, పథకాల అమలు ఆధారంగా 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 21 నియోజకవర్గాలు A+ గ్రేడ్ సాధించగా, A గ్రేడ్‌లో 153 నిలిచాయి. ఒకే ఒక్క నియోజకవర్గం B గ్రేడ్‌కు పరిమితమైంది. 93% మార్కులతో NTR జిల్లాలోని విజయవాడ వెస్ట్ నంబర్ వన్‌గా నిలిచింది. దీనికి సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాజువాక, కాకినాడ సిటీ, విజయవాడ ఈస్ట్.. 2,3,4 ర్యాంకులు సాధించాయి.
Similar News
News February 23, 2026
హార్వర్డ్ నుంచి CM రేవంత్‌కు ఆహ్వానం

TG: CM రేవంత్ రెడ్డికి USలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. మార్చి 27న అక్కడ జరిగే ‘AI పాలసీ సింపోజియం’లో ప్రసంగించాలని నిర్వాహకులు కోరారు. ఈ సదస్సుకు భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక CM రేవంత్ కావడం విశేషం. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు, ఉపాధిపై దాని ప్రభావం వంటి అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. TG ప్రభుత్వం చేపట్టిన AI ప్రాజెక్టులను ఈ వేదికపై వివరించనున్నారు.
News February 23, 2026
పవర్‌ప్లేలో వికెట్లు పారేసుకున్నాం.. ఓటమిపై సూర్య కామెంట్స్!

SAతో భారీ ఓటమికి బౌలర్లు కారణం కాదని కెప్టెన్ సూర్య వారిని వెనకేసుకొచ్చారు. 188 రన్స్ ఛేజింగ్‌లో పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం టీమ్ఇండియా కొంపముంచిందన్నారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ రాణించినా.. మిగతా వారు ధారాళంగా రన్స్ ఇచ్చారు. అయినప్పటికీ బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని సూర్య తేల్చేశారు. జింబాబ్వేతో జరిగే తదుపరి మ్యాచ్‌లో బౌన్స్ బ్యాక్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు.
News February 23, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 23)

1455- గూటెన్‌బర్గ్ తొలి బైబిల్ ముద్రణ పూర్తి
1876- ప్రముఖ సంఘ సంస్కర్త గాడ్గే మహరాజ్ జననం
1893- డీజిల్ ఇంజిన్‌కు పేటెంట్
1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
1954- పోలియో వ్యాక్సిన్ మొదటిసారిగా పిల్లలపై ప్రయోగం
1957- దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జననం
1969- అలనాటి హీరోయిన్ మధుబాల మరణం (ఫొటోలో)
* World Understanding and Peace Day


