News April 30, 2024

గ్రూప్-1 మూల్యాంకనంపై ఆధారాలివ్వండి: హైకోర్టు

image

AP: గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో చోటు చేసుకున్న అక్రమాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు పిటిషనర్లను ఆదేశించింది. ఉద్యోగాలు చేస్తున్న 167 మందిని తొలగించవద్దని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఉద్యోగాలు పొందిన వారు కోర్టులో సవాల్ చేశారు. దీంతో మూల్యాంకనంపై ఆధారాలు సమర్పించాలని కోర్టు కోరింది.

Similar News

News March 16, 2026

200 మందికి పైగా పిల్లలు మృతి: ఇరాన్

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది ఇరానియన్లు చనిపోయారని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అరాఘ్చీ తెలిపారు. ఇందులో 200 మందికి పైగా పిల్లలున్నారని వెల్లడించారు. ఇరానియన్లను చంపడాన్ని పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ‘మేం సీజ్‌ఫైర్ వద్దనేది యుద్ధం కోసం కాదు. శత్రువులు మాపై మరోసారి దాడులు చేయకుండా ఉండేలా ఈ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నాం. ఇప్పటికే వారికి గుణపాఠం చెప్పాం’ అని పేర్కొన్నారు.

News March 16, 2026

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ గెలుపు

image

బిహార్ CM నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో 5 స్థానాలకు ఎన్నికలు జరగ్గా NDA కూటమి అన్నింటినీ కైవసం చేసుకుంది. నితీశ్ కుమార్‌తో పాటు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో నితీశ్ త్వరలోనే CM పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ MP, MLA, MLCగా పనిచేశానని, రాజ్యసభ పదవితో మిగిలిన ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పిన విషయం తెలిసిందే.

News March 16, 2026

కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

image

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.