News February 10, 2026

ఖమ్మం: 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి ప్రచారమైనా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 117 వార్డులకు 241 పోలింగ్ కేంద్రాలలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 20, 2026

రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి బాధాకరం: హరీష్‌రావు

image

రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News February 20, 2026

పెనుబల్లి: మిత్రుడి కోసం వచ్చి.. అనంతలోకాలకు!

image

మిత్రుడి దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏలూరు జిల్లా ఎండపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బర్రె వంశీ మృతి చెందారు. పెనుబల్లి వద్ద గురువారం బైక్ అదుపుతప్పి డ్రైనేజీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి డిపోలో పనిచేస్తున్న వంశీకి భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. స్నేహితుడిని కడసారి చూసేందుకు వచ్చి, తానూ విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

News February 20, 2026

ఖమ్మం: అడ్డగోలుగా అబార్షన్ కిట్స్ అమ్మకాలు..!

image

ఖమ్మం జిల్లాలో డాక్టర్ రిఫరెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని వాడుతున్న మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏడాదిలో 50 వేల కిట్స్ అమ్ముడయ్యాయి. షెడ్యూల్-H కిందకి వచ్చే మీసో ప్రోస్టల్ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దు. ఇలాంటి మెడికల్ షాపులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని DI అనిల్ తెలిపారు.