News April 30, 2024

NGKL: రూ.50 ఇవ్వలేదని దుకాణానికి నిప్పు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో గత వారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులో చూశాయి. ఈనెల 22న షాపు యజమానిని రూ.50 విలువైన పండ్లను అడిగితే ఇవ్వలేదని ఆ షాపులో పనిచేసే వర్కర్ ఆసిద్ షాపుకు నిప్పు పెట్టినట్లు సీఐ కనకయ్య తెలిపారు. దీంతో మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న మరో నాలుగు షాపులు కాలి బూడిద అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

Similar News

News March 17, 2026

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 7.0, నవాబుపేట 6.5, గండీడ్ మండలం సల్కర్ పేట 4.5, మిడ్జిల్ మండలం దోనూరు 2.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5, బాలానగర్ 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.

News March 17, 2026

పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

image

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?

News March 17, 2026

ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.