News April 30, 2024
ఉమ్మడి ఆదిలాబాద్‌కు మోదీ, యోగి, అమిత్ షా..?

ఎన్నికల ప్రచారంలో భాగంగా BJP తరపున ఆదిలాబాద్‌లో జరగాల్సిన మహారాష్ట్ర CM ఏక్నాథ్ శిండే, విదేశాంగమంత్రి శివశంకర్ పర్యటనలు రద్దయ్యాయి. కాగా మే మొదటి వారంలో PM మోదీ, ఉత్తరప్రదేశ్ CM యోగి, కేంద్రమంత్రి అమిత్ షా సభలను ఖరారు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. అనుకూలిస్తే ఆసిఫాబాద్- కాగజ్ నగర్ కలిసేలా మోదీ, ఆదిలాబాద్ – ఉట్నూర్ కలిసేలా యోగి, నిర్మల్ -ముథోల్ కలిసేలా అమిత్ షా సభలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
Similar News
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2026
ADB: బాధితుల ఇండ్ల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు

ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో బాధితుల ఇండ్ల వద్దకే శనివారం పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. డివిజన్ పరిధిలో 6 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సులభంగా వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చిందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇది బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.