News April 30, 2024

వనపర్తి: మే 24న పాలీసెట్ ప్రవేశ పరీక్ష

image

వనపర్తి: పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు స్థానిక కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈ రోజు వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు https://polycet.sbtet.telangan.gov.in చూడాలన్నారు.

Similar News

News March 12, 2026

MBNR: “కురుమూర్తి కొండలను కాపాడండి”

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలోని శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి దేవాలయ కొండల వద్ద క్వారీ అనుమతులపై భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ మార్చి 14న ఉదయం 10 గంటలకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1000 చరిత్ర కలిగిన కురుమూర్తి కొండలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

News March 12, 2026

రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో చెన్నవెళ్లి యువకుడు మృతి

image

రాజాపూర్ మండల పరిధిలోని చెన్నవెళ్లికి చెందిన చిలివేరి నరేశ్ గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. నరేశ్ రాజాపూర్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తుండగా అతని బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. షాద్‌నగర్ సమీపంలోని ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మృతి పట్ల చెన్నవెల్లిలో విషాదఛాయలు అలముకొన్నాయి.

News March 11, 2026

MBNR : పదో తరగతి పరీక్షలు.. ఫోన్ వాడితే ఉద్యోగం ఊస్ట్!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ మొబైల్ ఫోన్లతో అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఫోన్ వాడుతూ పట్టుబడితే, వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.