News April 30, 2024
NZB ఒకే నియోజకవర్గం.. జిల్లాలు మూడు

నిజామాబాద్ పార్లమెంట్ మూడు జిల్లాల పరిధిలో ఉంది. NZBజిల్లాలోని నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. మొత్తం 1,808 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. NZBలో 1,288, జగిత్యాలలో 516, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 ఉన్నాయి. జిల్లాల విభజనలో కమ్మర్‌పల్లి మండలంలోని మానాల గ్రామం సిరిసిల్లలోకి వెళ్లింది.
Similar News
News March 15, 2026
NZB: వారం రోజుల్లో 230 కేసులు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో (9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు) 230 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. 230 మందిని కోర్టులో హాజరు పరచగా రూ.21.60 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 14 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని CP వివరించారు.
News March 15, 2026
NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.