News April 30, 2024
రోహిత్‌శర్మ గురించి మీకివి తెలుసా?

ఈరోజు రోహిత్‌శర్మ జన్మదినం. అంతర్జాతీయ వేదికపై ఎన్నో రికార్డులు నెలకొల్పి ఇండియన్ క్రికెట్ సత్తా చాటారు. అయితే.. రోహిత్ గురించి మీకెంత తెలుసో ఈ ప్రశ్నలకు సమాధానాల రూపంలో కామెంట్ చేయండి.
1. రోహిత్ MI జట్టుపై సాధించిన రికార్డు?
2. వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్ సెంచరీలెన్ని?
3. హిట్‌మ్యాన్ కాకుండా రోహిత్‌కున్న మరో నిక్‌నేమ్ ఏంటి?
4. రోహిత్ పేరిట వన్డేల్లో ఎన్ని డబుల్ సెంచరీలున్నాయి?
Similar News
News March 6, 2026
యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.
News March 6, 2026
బెంబేలెత్తించిన బెథెల్

T20WC: సెమీఫైనల్లో భారత్ గెలిచినా ఇంగ్లండ్ బ్యాటర్ బెథెల్ మనసులు గెలిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ భారత ఆటగాళ్లను, అభిమానులను వణికించారు. 48 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 రన్స్ చేశారు. బెథెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడారంటూ టీమ్ ఇండియా ఫ్యాన్స్ సైతం ప్రశంసిస్తున్నారు.
News March 6, 2026
తెలంగాణకు కొత్త గవర్నర్

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.


