News April 30, 2024

10th Results: వెనుకబడ్డ హైదరాబాద్‌‌‌‌

image

10వ తరగతి ఫలితాల్లో హైదరాబాద్‌ వెనుకబడింది. 33 జిల్లా‌ల వారీగా విడుదల చేసిన జాబితాలో 30వ స్థానంతో సరిపెట్టుకొంది. HYDలో మొత్తం 73,202 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 86.76 శాతంతో 63,511 మంది పాస్ అయ్యారు. 91.01 %తో 24వ స్థానంలో రంగారెడ్డి, 89.61 %‌తో మేడ్చల్ మల్కాజిగిరి 27వ స్థానం, 65.10%తో వికారాబాద్‌ జిల్లా చివరి(33) స్థానంలో నిలవడం గమనార్హం.

Similar News

News September 13, 2025

యాకుత్‌పురా ఘ‌ట‌న‌కు.. బాధ్యుల‌పై హైడ్రా చ‌ర్య‌లు

image

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి ప‌డిపోయిన ఘ‌ట‌న‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధ‌వారం సిల్ట్‌ను తొల‌గించ‌డానికి తెర‌చిన మ్యాన్ హోల్ మూయ‌క‌పోవ‌డంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో డీఆర్ ఎఫ్ సూప‌ర్‌వైజర్లు ఇద్ద‌రికి డిమోషన్, ఇద్ద‌రిని తొల‌గించాలని ఆదేశించింది.

News September 12, 2025

HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

image

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్‌&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.

News September 12, 2025

GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.