News April 30, 2024
టీడీపీ నుంచి ముడియం సూర్యచంద్రరావు సస్పెండ్

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు, ముడియం సూర్యచంద్రరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ముడియం సూర్యచంద్రరావు టీడీపీలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2026
ఏళ్లు గడుస్తున్నా అందని టిడ్కో ఇళ్లు.. లబ్ధిదారుల కంటతడి!

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News March 21, 2026
ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 21, 2026
పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.


