News April 30, 2024
10th Results: నారాయణపేటలో 93.13% పాస్

టెన్త్ ఫలితాల్లో నారాయణపేట సత్తాచాటింది. 93.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 7129 మంది పాసయ్యారు. MBNR(89.47%) 28వ స్థానంలో నిలవగా 11338 ఉత్తీర్ణత సాధించారు. NGKL(91.57) 23వ స్థానంలో ఉండగా 9621 పాసయ్యారు. WNP(86.93) 29వ స్థానంలో నిలవగా 5988 ఉత్తీర్ణత సాధించగా.. GDL(81.38) 32న స్థానంలో ఉండగా 5839 మంది పాసయ్యారు.
Similar News
News April 1, 2026
MBNR: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.
News April 1, 2026
MBNR: సల్కర్‌పేటలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో అత్యధికంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 37.2, దేవరకద్ర 35.6, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 35.3, మహమ్మదాబాద్ 35.2, నవాబుపేట 35.0, మహబూబ్ నగర్ అర్బన్, కౌకుంట్ల 34.9, అడ్డాకుల, నవాబుపేట మండలం కొల్లూరు 34.8, భూత్పూర్ 34.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 1, 2026
MBNR: ఇప్ప చెట్ల పెంపకానికి 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘ఇప్ప’ (మహువా) చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవకు ఎమ్మెల్యేలు 52 MLAలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరువును ఇప్ప చెట్లు తట్టుకోగలవని, మొక్కల పెంపకం విస్తరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. గ్రామీణ, గిరిజన తండాలలో ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. గిరిజనులకు జీవనోపాధి దొరుకుతుందన్నారు.


