News April 30, 2024
నాకు సరైన గుర్తింపు దక్కలేదు: ఇలియానా

ఇండస్ట్రీలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని, అందుకు కారణం కూడా తెలియదని హీరోయిన్ ఇలియానా అన్నారు. ‘బర్ఫీ సినిమాలో నటించాక సౌత్ ఇండస్ట్రీ నుంచి నాకు సినిమా ఆఫర్లు రాలేదు. అక్కడి నిర్మాతలు, దర్శకులు నేను బాలీవుడ్‌లో సెటిల్ అయ్యానని అనుకున్నారు. మంచి కథ దొరికితే నేను ఎక్కడైనా నటించడానికి అప్పుడు సిద్ధంగా ఉన్నా. కానీ నాకు అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
‘ధురంధర్’ డైరెక్టర్ గురించి తెలుసా?

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఇతడు కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవారు. 1983లో ఢిల్లీలో జన్మించారు. క్రికెటర్ కావాలని కలలు కన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వదిలేశారు. ముంబైకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. 2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ అనే సినిమాతో సంచలనం సృష్టించారు. 2021లో హీరోయిన్ యామీ గౌతమ్‌ను పెళ్లి చేసుకోగా 2024లో కుమారుడు జన్మించాడు.
News March 19, 2026
ఖతర్‌పై దాడితో భారత్‌కు మరిన్ని కష్టాలు!

ఖతర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్ <<19422796>>రాస్ లఫన్<<>>పై ఇరాన్ చేసిన దాడి భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియా 50% LNGని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. దీంట్లో 40% వాటా ఖతర్‌దే. దీంతో భారత్‌లో పారిశ్రామిక, విద్యుదుత్పత్తి రంగాల్లో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే నేచురల్ గ్యాస్ దిగుమతులు తగ్గాయి. తాజా దాడితో సమస్య మరింత తీవ్రం కానుంది.