News April 30, 2024
5రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 5 రోజుల్లోనే రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది! ఆయన సంస్థ టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడమే ఇందుక్కారణం. మస్క్ తాజాగా చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థను అమలుచేసేందుకు చైనా ఆమోదం తెలిపిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు దూసుకెళ్లాయి. నిన్న ఒక్క సెషన్‌లోనే ఏకంగా 18.5 బిలియన్ డాలర్లు లాభపడటం విశేషం.
Similar News
News March 4, 2026
డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో ఉద్యోగాలు

<
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.
News March 4, 2026
2వేల టార్గెట్లను ధ్వంసం చేశాం: US మిలిటరీ

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌లోని 2వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆ దేశ నేవీకి చెందిన ఒక సబ్‌మెరైన్ సహా 17 యుద్ధనౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఒక్క ఇరాన్ షిప్పు కూడా లేదని తెలిపింది. మరోవైపు నేవీతో పాటు ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బ తీసేలా అమెరికా దాడులు చేస్తోంది.


