News April 30, 2024
కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటుందా?

AP: ఎన్డీఏ కూటమికి గాజు గ్లాసు గుర్తు తలనొప్పిగా మారింది. జనసేన అభ్యర్థులు బరిలో లేని చోట ఇండిపెండెంట్లకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించడం చర్చనీయాంశమైంది. 50కిపైగా MLA, 6 MP స్థానాల్లో స్వతంత్రులకు ఈ గుర్తు కేటాయించింది. దీంతో తమ ఓట్లు చీలిపోతాయని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు. మంగళగిరి, కుప్పం, టెక్కలి, రాప్తాడు, అద్దంకి, పర్చూరు, మాచర్ల తదితర స్థానాల్లో పోటీ చేసే స్వతంత్రులకు కేటాయించింది.
Similar News
News March 18, 2026
గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.
News March 18, 2026
ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 18, 2026
మరికొన్ని గంటల్లో విధ్వంసం.. ఇరాన్ హెచ్చరిక

మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సమ్రెఫ్, ఖతర్‌లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యూఏఈలోని అల్-హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.


