News February 10, 2026
సిద్దిపేట: పెళ్లికి OK చెప్పిన పెద్దలు.. ప్రేమ జంట సూసైడ్

సిద్దిపేట(R) మండలం పెద్దలింగారెడ్డిపల్లి శివారులో <<19096092>>ప్రేమ జంట<<>> బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నారాయణరావుపేటకు చెందిన శ్రావణ్(21), పెద్దకోడూరుకు చెందిన నవ్య(17) వరుసకు బావామరదళ్లు కాగా కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలిసింది. పెళ్లికి అంగీకరించిన పెద్దలు.. పెళ్లికి కొంతకాలం ఆగాలని సూచించారు. అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఇరువురు సూసైడ్ చేసుకున్నారు.
Similar News
News February 21, 2026
ANU పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో B.ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన I, lV 1వ, III/IV 5వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 30 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 16లోపు, రూ.100 ఫైన్‌తో 17లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.
News February 21, 2026
చిత్తూరులో బర్డ్ ప్లూ.. మనుషులకు సోకలేదు!

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మనుషులెవరికీ బర్డ్ ప్లూ సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండియన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి వ్యాధి సోకిందనే ప్రచారం అవాస్తవమన్నారు. 54 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపగా నెగిటివ్గా తేలిందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News February 21, 2026
చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.


