News April 30, 2024

డాక్టర్ కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

image

AP: విజయవాడ గురునానక్ నగర్ కాలనీలో విషాదం నెలకొంది. ఓ డాక్టర్ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి బయట డాక్టర్ డి.శ్రీనివాస్ ఉరేసుకోగా.. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇందులో హత్య కోణం ఉందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 25, 2026

SRH vs RCB.. తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌తో IPL 2026 ప్రారంభం కానుంది. ఈ నెల 28న బెంగళూరులో జరిగే ఈ పోరుకు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పగలు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనా.. సాయంత్రం మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం 60 శాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, ఈదురుగాలుల వల్ల ఆటకు అంతరాయం కలగొచ్చని చెప్పింది. దీంతో మ్యాచ్ ఆలస్యం అయ్యేందుకు ఆస్కారముంది.

News March 25, 2026

అత్యంత కాలుష్య పట్టణం మన దేశంలోనే..

image

ప్రపంచంలో అత్యంత కాలుష్య పట్టణంగా లోనీ(UP) నిలిచింది. స్విస్ సంస్థ IQఎయిర్ విడుదల చేసిన గ్లోబల్ ర్యాంకింగ్స్-2025లో ఈ విషయం వెల్లడైంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో న్యూఢిల్లీ టాప్‌లో ఉంది. అదే సమయంలో వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా పాకిస్థాన్ నిలిచింది. ఈ లిస్టులో ఇండియా 6వ ప్లేస్‌లో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో కేవలం 14% నగరాలు మాత్రమే WHO ఎయిర్ క్వాలిటీ ప్రమాణాన్ని అందుకున్నాయి.

News March 24, 2026

RCB అమ్మకం.. కొత్త ఓనర్ ఎవరంటే?

image

RCB జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కన్సార్షియంలో బిర్లా గ్రూప్, US కంపెనీలు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్‌, టైమ్స్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు $1.78Bతో(₹16,706Cr) ఒప్పందం జరిగినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి యునైటెడ్ స్పిరిట్స్(Diageo) యజమానిగా ఉంది.