News April 30, 2024
UPDATE: పెళ్లైన మూడు రోజులకే వరుడు మృతి.. వధువు పరిస్థితి విషమం

మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద రాత్రి జరిగిన <<13149362>>రోడ్డు ప్రమాదం<<>>లో పెళ్లైన మూడు రోజులకే వరుడు దుర్మరణం చెందగా వధువు పరిస్థితి విషమంగా ఉంది. చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఎర్రోళ్ల వెంకటేష్(22)కు మాసాయిపేట మండలం పోతన్పల్లికి చెందిన శ్రీలతతో ఈనెల 26న వివాహం జరిగింది. కాగా రాత్రి బైక్‌పై దంపతులు పోతన్‌పల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.
Similar News
News March 14, 2026
శివంపేట: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పంబ గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు భర్యతో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 13, 2026
మెదక్: టెన్త్ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మెదక్ డీఈఓ విజయ తెలిపారు. బాలురు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రూట్లతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలకు ఆధార్ కార్డు ద్వారా మహాలక్ష్మి పథకం కింద ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
News March 13, 2026
పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

మెదక్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.


