News February 10, 2026
మెదక్: ‘తెరవెనుక రాజకీయం’ ఫలితాలను మారుస్తుందా..?

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో రాజకీయం తెరవెనుకకు మళ్లింది. అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను ఆకర్షించేందుకు శక్తియుక్తులను వాడుతున్నారు. తమ ప్రత్యర్థుల ఓటు బ్యాంకుకు కన్నం వేసి ఆ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు ఓటరు తీర్పును ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈనెల 13న తేలనుంది.
Similar News
News April 7, 2026
ఎన్టీఆర్ వైద్య సేవ.. ఆస్పత్రుల సమ్మె విరమణ

AP: రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ(ఆర్యోగ్రశ్రీ) నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె ఇవాళ ముగిసింది. 10 రోజుల్లో రూ.వెయ్యి కోట్ల బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ వెల్లడించింది. 10 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మళ్లీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది.
News April 7, 2026
నెల్లూరు: నేడే లాస్ట్ ఛాన్స్

నెల్లూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు నేటితో గడువు ముగియనున్నట్లు జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. నెల్లూరు, తుమ్మలపెంట, గండిపాలెం, చిలమానుచేను, ఆత్మకూరులో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారని చెప్పారు.
News April 7, 2026
పొన్నంకు డిప్యూటీ సీఎం OR పీసీసీ చీఫ్?

రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే BC కోటాలో పొన్నం ప్రభాకర్‌కు డిప్యూటీ CM ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. అయితే, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో PCC చీఫ్ మహేష్ గౌడ్‌కు డిప్యూటీ CM, PCC ప్రెసిడెంట్‌గా పొన్నం ప్రభాకర్‌ను నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల్లో భారీ మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.


