News April 30, 2024

ఏలూరు: ఘోరం.. ACCIDENTలో తండ్రి, కూతురు మృతి

image

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనగా ఘటన స్థలంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. కొడుకు, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ దుర్గ గుడిని దర్శించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2026

ATM కార్డు మార్చి.. తణుకులో వృద్ధుడికి కుచ్చుటోపీ

image

ఏటీఎం కేంద్రంలో సహాయం చేస్తానని నమ్మించి ఓ వృద్ధుడిని మోసగించిన ఘటన తణుకులో కలకలం రేపింది. ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డుకు చెందిన బచ్చు సుబ్బారావు సోమవారం ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎంలో నగదు తీయడానికి వెళ్లారు. అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం నెపంతో కార్డు మార్చేసి, సుబ్బారావు ఖాతా నుంచి రూ.23,430 నగదు కాజేశాడు. నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

News March 10, 2026

ప.గో: అదనపు కట్నం వేధింపులు.. భర్తతో సహా నలుగురిపై కేసు

image

అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్త, మరిది, మరదలుపై నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. లుటుకుర్తి రాజేశ్‌కు స్వరూపతో 2020లో వివాహమైంది. అప్పటి నుంచి రాజేశ్ అదనపు కట్నం తేవాలని, అనారోగ్యంతో ఉన్న పిల్లాడి వైద్యానికి కూడా డబ్బులు పంపకుండా, గల్ఫ్‌లో ఉంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.

News March 10, 2026

ప.గో: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. చివరకు..

image

మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతు మాటలతో దూషిస్తున్న మల్లవరపు యేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని మహిళలు పంట బోదే వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఆ సమయంలో యేసు అక్కడకి చేరుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు మొగల్తూరు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై జి.వాసు నిందితుడిపై కేసు నమోదు చేశారు.