News February 10, 2026

మెదక్: మున్సి‘పోల్’ క్లైమాక్స్.. అభ్యర్థుల్లో ఖర్చు టెన్షన్!

image

మున్సిపల్ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. రేపే పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థుల్లో గెలుపు ధీమా కంటే ఖర్చుపైనే ఆందోళన కనిపిస్తోంది. గెలుపు కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు చేయగా, ఇప్పుడు వాటిని తిరిగి ఎలా చెల్లించాలనే టెన్షన్ నెలకొంది. ఒక్కో అభ్యర్థి ఇప్పటికే రూ.10 నుంచి 20 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగియడంతో పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి.

Similar News

News March 30, 2026

TU: HIV/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

image

టీయూలో రెడ్ రిబ్బన్ క్లబ్, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) సెల్ ఆధ్వర్యంలో HIV/AIDS పై విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ముఖ్యవక్తగా వచ్చిన డా.మురళీకృష్ణ మాట్లాడుతూ.. HIV/AIDS వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, అపోహలపై వివరించారు. DPM సుధాకర్ మాట్లాడుతూ.. ఏఆర్టీ ద్వారా వైద్యం పొందుతున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు.

News March 30, 2026

KMR: జయంతి ఉత్సవాలపై సన్నాహక భేటీ

image

అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై APR 1న మధ్యాహ్నం 4 గంటలకు కామారెడ్డి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సన్నాహక సమావేశం జరగనుంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ల అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని ఎస్సీ సంఘాల నాయకులు హాజరై తమ సూచనలు అందించాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లు, సమన్వయంపై చర్చించనున్నారు.

News March 30, 2026

PGRSకు 178 ఫిర్యాదులు: కలెక్టర్

image

అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 178 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.