News April 30, 2024

JDS నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్

image

కర్ణాటకలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేస్తున్నట్లు జేడీఎస్ పార్టీ ప్రకటించింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు, పలు వీడియోలు బయటకు రావడంపై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం SIT ద్వారా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు తాము సహకరిస్తామని.. అప్పటివరకు రేవణ్ణను సస్పెండ్ చేస్తున్నట్లు JDS వెల్లడించింది. అటు రేవణ్ణ ఇప్పటికే విదేశాలకు పారిపోయారు.

Similar News

News April 1, 2026

మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా షాక్

image

AUS స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డ్ షాక్ ఇచ్చింది. 21మందితో కూడిన 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు కల్పించలేదు. రాబోయే 12 నెలల్లో AUS జట్టు 20 టెస్టులు ఆడనుంది. దీని కోసం టెస్ట్ స్పెషలిస్టులకే ప్రాధాన్యం కల్పించింది. ఇప్పటికే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన 37ఏళ్ల మ్యాక్సీ కెరీర్ చరమాంకానికి చేరినట్లే. ఇక యంగ్ ప్లేయర్ సామ్ కోన్ట్సాస్‌కూ 21 మందిలో చోటు దక్కలేదు.

News April 1, 2026

ఐడియా చెప్పండి.. రూ.10లక్షలు గెలుచుకోండి!

image

ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘BIOPACKATHON 2026’ నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐడియాలు ఇచ్చేవారికి భారీగా బహుమతులు అందిస్తారు. మొదటి బహుమతిగా ₹10 లక్షలు, సెకండ్ రూ.7లక్షలు, మూడో స్థానంలో నిలిచినవారు రూ.5లక్షలు గెలుచుకోవచ్చు. విజేతలకు నగదుతో పాటు పరిశ్రమలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 24, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

News April 1, 2026

అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

image

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. దీనికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ తరఫున మాణిక్కం ఠాకూర్ ప్రకటన చేశారు. ఇక చర్చకు వైసీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ బిల్లుపై చర్చకు రెండు గంటలు కేటాయించాలని టీడీపీ ఎంపీలు కోరారు. అయితే తొలుత గంట పాటు చర్చిద్దామని, తర్వాత అవసరమైతే మరో గంట పొడిగిస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చారు.