News February 10, 2026
ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎస్పీ పర్యవేక్షణలో ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి 1,097 మంది, 5 ప్లాటున్ల టీజీఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించారు.
Similar News
News February 14, 2026
NLG: మున్సిపల్ ఎన్నికల్లో వాడిపోయిన కమలం

ఉమ్మడి NLG జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆశించిన విజయం దక్కించుకోలేకపోయారు. యాదాద్రి జిల్లాలో 12 వార్డుల్లో BNG 4, CPL 3, గుట్ట 2, ఆలేరు 2, పోచంపల్లి 1, MLG, DVKలో ఒక్కో వార్డు మాత్రమే, SRPTలో కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకున్నారు. మొత్తంగా జిల్లాల వారీగా 15 వార్డులు, NLG కార్పొరేషన్లో 4 డివిజన్లో మాత్రమే దక్కాయి.
News February 14, 2026
మిర్యాలగూడలో ఇదే హయ్యెస్ట్ మెజార్టీ

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 29వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జావిద్ తన సమీప సీపీఎం అభ్యర్థిపై 1,076 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి, మున్సిపాలిటీలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు. మరోవైపు, 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు కేవలం ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి, అత్యల్ప మెజారిటీతో గెలుపొందడం విశేషం.
News February 13, 2026
నల్గొండ: ‘ప్రజావాణి’ ప్రారంభం

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడంతో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ సోమవారం నుంచి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలను యథావిధిగా స్వీకరిస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


