News February 10, 2026
NGKL: మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ పై నిషేధం

జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరు కూడా పత్రిక ప్రకటనలు చేయరాదని సూచించారు. నాయకులు పత్రికా సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందిన అధికారులు మాత్రమే మాట్లాడాలని అన్నారు.
Similar News
News February 18, 2026
విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని, 71 యుద్ధ నౌకల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది.
News February 18, 2026
UAEపై సౌతాఫ్రికా ఘన విజయం

T20WC: UAEని సౌతాఫ్రికా మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అరబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బ్రెవిస్ 36 పరుగులతో రాణించారు. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని సౌతాఫ్రికా ఇప్పటికే సూపర్-8కి చేరుకోగా UAE టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
News February 18, 2026
నంబులపూలకుంట ఆసుపత్రిలో అధికారుల వాగ్వాదం

సత్యసాయి జిల్లా నంబులపూలకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వైద్యాధికారి ఆనంద్ వర్ధన్, సీహెచ్ఓ నాగలక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గర్భిణీల చికిత్స, సిబ్బంది విధుల కేటాయింపుపై తలెత్తిన విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పరం కుర్చీలు, ఫైళ్లు విసురుకున్నారన్న ప్రచారం మండలంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


