News February 10, 2026

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందిన ‘నన్నయ్య’

image

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వందేమాతరం 150 ఏళ్ళ వేడుకల్లో 21,000 మంది విద్యార్థులు, సిబ్బందిచే జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించారు. ఈ క్రమంలో దేశభక్తి, ఐక్యతకు చిహ్నంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఆఫ్ నేషనల్ రికార్డు ప్రదానం చేశారు. మంగళవారం వర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్ అందజేశారు.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.