News February 10, 2026

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 వార్డులు ఉండగా 1,85,348 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు 1,34,775 మంది, అశ్వారావుపేట 22 వార్డులు 16,850 మంది, ఇల్లందు 24 వార్డులు 33,723 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News February 22, 2026

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

image

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.

News February 22, 2026

అనంత: పరీక్షకు ముందే ఇంటర్ ప్రశ్నపత్రాల ఓపెన్

image

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశ్నపత్రాలు ఆయా సెంటర్లకు చేరుకున్నాయి. అయితే ఒక కేంద్రానికి కేటాయించిన బండిళ్లు మరో కేంద్రానికి వచ్చాయి. పరీక్షకు 10 నిమిషాల ముందు తెరవాల్సిన బండిళ్ల (సెట్-3)ను నిన్ననే ఓపెన్ చేయడం చర్చనీయాంశమైంది. ఉరవకొండలోని ఓ కేంద్రానికి సంబంధించిన కవర్లు చెక్ చేయగా 6 కవర్లలో 4 కవర్లు అదే సెంటర్‌కు, మిగిలిన 2 కవర్లు వేరే సెంటర్లకు చెందినవిగా గుర్తించారు.

News February 22, 2026

కృష్ణా: ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో DEC 2025లో నిర్వహించిన బి.ఫార్మసీ 5వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని, రీవాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ నెల 27లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 చెల్లించాలని KRU అధ్యాపకులు తెలిపారు.