News April 30, 2024
అక్రమ రవాణాపై నిఘా పెంచాలి: కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలని నెల్లూరు కలెక్టర్ ఎం.హరినారాయణన్ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నోడల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెక్‌పోస్ట్‌ల వద్ద పక్కాగా తనిఖీలు చేయాలని సూచించారు.
Similar News
News March 14, 2026
నెల్లూరు జిల్లాలో పెరిగిన నూనె ధరలు

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News March 14, 2026
నెల్లూరు: కిరోసిన్ అయినా ఇవ్వండి సార్..!

నెల్లూరు జిల్లాలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ సర్వర్ పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేక ఇళ్లలో అవస్థలు పడుతున్నామని.. సమస్య పరిష్కారమయ్యే వరకు తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.
News March 14, 2026
షాకింగ్.. నెల్లూరు జిల్లాలో భారీగా పెరిగిన ధరలు

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లా నుంచి నిమ్మ, గుడ్లు ఎగుమతులు పడిపోయాయి. దీంతో వాటి ధరలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో చికెన్ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా నెల్లూరులో శనివారం బాయిలర్ కోడి ధర రూ.175 పలికింది. స్కిన్‌తో కూడిన కేజీ చికెన్ రూ.304, స్కిన్ లెస్ రూ.334గా ఉంది. డిసెంబర్, జనవరిలో కోళ్లకు వైరస్ వచ్చి చనిపోవడంతో ధరలు పెరిగాయని.. రంజాన్‌కు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.


