News February 10, 2026

మహాశివరాత్రి సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

image

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురంలోని తన కార్యాలయం నుంచి VC నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని తగిన బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల తగు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సులభమైన, సురక్షితమైన దర్శనాన్ని కల్పించేలా క్యూ లైన్ల వద్ద బందోబస్త్ పెంచాలన్నారు.

Similar News

News February 14, 2026

అల్లూరి జిల్లాలో నేడు పాఠశాలలకు ‘సెలవులు లేవు’

image

ఈ నెల 14 వ తేదీ 2వ శనివారం (నేడు) అయినప్పటికీ పాఠశాలలకు ఎటువంటి సెలవు లేదని డీఈవో డాక్టర్ కే.రామకృష్ణారావు తెలిపారు. వాస్తవానికి 2వ శనివారం సెలవు ఇవ్వాల్సినప్పటికీ మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని విద్యాలయాలకు 4 రోజులు సెలవు ప్రకటించారన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో 2వ శనివారం కూడా పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయన్నారు. నేడు విద్యాలయాలకు ఎలాంటి సెలవు లేదని MEO, HM, ఉపాధ్యాయులు గమనించాలన్నారు.

News February 14, 2026

సింగరాయకొండ: బీచ్ ఫెస్టివల్ మ్యాప్‌ను విడుదల చేసిన అధికారులు

image

సింగరాయకొండ మండలం పాకలలో జరిగే బీచ్ ఫెస్టివల్‌కు అధికారులు మ్యాప్ విడుదల చేశారు. పార్కింగ్ జోన్ బీచ్ సమీపానికి ఎడమవైపు కేటాయించారు. అక్కడి నుంచి ఉత్సవ ప్రాంగణానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. కాగా.. సాగర్ తీరానికి వెళ్లేందుకు 3 ప్రధాన రహదారులు ఏర్పాటు చేయగా.. వీవీఐపీలకు మరో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. కాగా ఫుడ్ జోన్, షాపింగ్ జోన్, ఫెస్టివల్‌కు ఆకర్షణీయం కాగలవని అంటున్నారు.

News February 14, 2026

నర్సాపూర్: నాడు 47తో ఓటమి.. నేడు 213తో గెలుపు

image

గత పురపాలక ఎన్నికల్లో నర్సాపూర్ 10వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 47 ఓట్లతో ఓటమి పాలైన అంతారం సుధీర్ గౌడ్.. ఈసారి పట్టుదలతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2వ వార్డు బరిలో నిలిచి, బీజేపీ ప్రత్యర్థిపై 213 ఓట్ల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు. ఓటమికి కుంగిపోకుండా ప్రజాసేవే లక్ష్యంగా పోరాడి గెలవవచ్చని ఆయన నిరూపించారు.