News February 10, 2026

ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి: కరీంనగర్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని పోలింగ్ కేంద్రం వద్ద చూపాలని, అర్హులైన వారంతా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.

Similar News

News April 19, 2026

కరీంనగర్: ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

image

కరీంనగర్ జిల్లాలోని 11 తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,444 మంది దరఖాస్తు చేసుకోగా, 1,263 మంది పరీక్షకు హాజరయ్యారు. 181 మంది గైర్హాజరయ్యారు. కొత్తపల్లి మండలం ఎలగందుల పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అశ్వని తానాజీ వాకడే తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆమె తెలిపారు.

News April 19, 2026

‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి మోక్షం ఎప్పుడు..?

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలులో జాప్యంపై అభ్యర్థులు ఆశతో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో రాయితీ రుణాల కోసం 55 వేలకు పైగా యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా యూనిట్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణాల పంపిణీ చెయ్యాలని కోరుతున్నారు.

News April 19, 2026

‘కరీంనగర్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలి’

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని చిత్రా మిశ్రా అధికారులకు ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లలో పారిశుధ్యం, వంటగది మరమ్మతులు, విద్యార్థులకు పోటీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతుల రిజిస్ట్రీ 100% పూర్తి చేసి, కరీంనగర్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.