News February 10, 2026
కరీంనగర్: పోలింగ్ వేళ.. అభ్యర్థుల్లో ఉత్కంఠ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. బహిరంగ సభలు, ర్యాలీలు ముగియడంతో సమరం ఇళ్ల ముంగిటకు మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు డోర్ టూ డోర్ వ్యూహాలు, డిజిటల్ ప్రచారంతో అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తాయిళాల పంపిణీ ఊపందుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడటంతో అభ్యర్థుల్లో గెలుపోటముల టెన్షన్ పెరుగుతోంది.
Similar News
News February 19, 2026
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా సమయంలో పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.
News February 19, 2026
దర్యాప్తు పూర్తయ్యే వరకు రామ్మోహన్ తప్పుకోవాలి: రోహిత్ పవార్

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ <<19106331>>మరోసారి<<>> కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కూలిపోయిన ఎయిర్‌క్రాఫ్ట్ VSR వెంచర్స్‌కు చెందినది. దీని ఓనర్ రోహిత్ సింగ్‌కు TDP, కేంద్ర మంత్రి రామ్మోహన్ క్లోజ్. దర్యాప్తు సజావుగా సాగాలంటే ఆయన పదవి నుంచి తప్పుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అజిత్ మరణంపై భార్య సునేత్ర CBI దర్యాప్తు కోరడాన్ని ఆయన స్వాగతించారు.
News February 19, 2026
గర్భనిరోధక మాత్రలను ఎప్పుడు తీసుకోవాలి?

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు ఒక మాత్రను తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ వైద్యుడి సిఫార్సు మేరకు దీన్ని 5 రోజుల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు సంభోగంలో పాల్గొన్న అనంతరం టాబ్లెట్‌ను ఎంత త్వరగా తీసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. సంభోగంలో పాల్గొని 72 గంటలు గడిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.


