News April 30, 2024

మెదక్ లోక్‌సభకు రికార్డుస్థాయిలో అభ్యర్థుల పోటీ

image

రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మెదక్‌ లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఎన్నిక ఖర్చు కూడా అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, మెదక్‌ ఎన్నికలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.

Similar News

News March 20, 2026

మెదక్ DCC కార్యదర్శిగా గడ్డి వెంకటేష్

image

తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్‌ను కాంగ్రెస్ మెదక్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన నేతలు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

News March 19, 2026

మెదక్: 61 మందితో డీసీసీ కార్యవర్గం ఏర్పాటు

image

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇందులో ఉపాధ్యక్షులుగా 14 మంది, ప్రధాన కార్యదర్శులుగా 20 మంది, కార్యదర్శులుగా 20 మంది, అధికార ప్రతినిధులకు ఆరుగురు, ఒక కోశాధికారిని నియమించారు. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కె.హరిత ఉపాధ్యక్షులుగా, తోడుపునూరి శివరామకృష్ణ కోశాధికారిగా నియమింపబడ్డారు.

News March 19, 2026

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

image

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రకటించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జిల్లా కమిటీని విస్తరించారు. జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మొత్తం 61 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీని విస్తరించినట్లు తెలిపారు.