News February 11, 2026
ప్రీ స్కూల్ అటెండెన్స్‌లో మన్యం జిల్లాకు అగ్రస్థానం

ప్రీ స్కూల్ అటెండెన్స్‌లో పార్వతీపురం మన్యం జిల్లా పనితీరు అద్భుతమని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.సూర్యకుమారి కొనియాడారు. 95% అటెండెన్స్‌తో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని ఆమె పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ప్రభాకర రెడ్డిని మంగళవారం అభినందించారు. స్టంటింగ్, అండర్ వెయిట్, ఫేస్టింగ్ సూచికల్లో కూడా మెరుగుదల కనిపించినట్లు చెప్పారు.
Similar News
News February 14, 2026
శివ నామాలు అర్థాలు ‘‘సోమశేఖర’’

‘సోమ’ అంటే అమృతం/చంద్రుడు అని అర్థం. చంద్రుడిని ధరించినవాడు అనే అర్థమే కాకుండా, తనలో అమృతాన్ని(శాశ్వతత్వాన్ని) కలిగి ఉన్నవాడు అని కూడా అర్థం వస్తుంది. మనస్సుపై నియంత్రణ సాధించినవాడే యోగి అని చంద్రుడిని ధరించడం ద్వారా శివుడు సూచిస్తాడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. అదుపు తప్పే మనస్సును తన ఆజ్ఞలో ఉంచుకునేవాడు ‘సోమశేఖరుడు’. ఈయనను పూజిస్తే మనోబలం పెరుగుతుందని, మానసిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
News February 14, 2026
డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ

అక్రమ సరోగసీ, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న <<17824045>>సృష్టి<<>> ఆసుపత్రి వైద్యురాలు నమ్రతను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఫర్టిలిటీ సెంటర్ పేరుతో 2014 నుంచి అక్రమ వ్యవహారాలు నడిపినట్లు దర్యాప్తులో గుర్తించింది. గతంలో మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అయినా కార్యకలాపాలు కొనసాగించినట్లు పేర్కొంది. ఇటీవల ఆమెపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది.
News February 14, 2026
10నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో రోడ్డుప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పది నెలల పసికందు అలిన్ షెరిన్ ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వారి విజ్ఞప్తితో చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. క్లిష్ట సమయంలోనూ పేరెంట్స్ నిర్ణయాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు.


