News February 11, 2026
ప్రజల భద్రత మరింత పటిష్ఠం

కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టిన డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా ప్రజల భద్రత మరింత పటిష్ఠం కానుంది. డే, నైట్ విజన్ సౌకర్యాలు కలిగిన డ్రోన్ కెమెరాలతో పగలు, రాత్రి నిరంతరం నిఘా పెట్టనున్నారు. దీంతో నేరాలు ముందే గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది. మహిళల భద్రతకు నియంత్రణ, కాలేజీలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిని గుర్తించే అధునాతన సాంకేతికను జోడించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది.
Similar News
News April 20, 2026
కర్నూలు: కాలువలో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆరేళ్ల బాలిక రక్షిత మృతి చెందడం విషాదాన్ని నింపింది. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి అదృశ్యం కాగా, ఆదివారం గ్రామ సమీపంలోని LLC కాలువలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. తమ గారాల పట్టి మరణంతో తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News April 19, 2026
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్య నరసమ్మపై భర్త రామయ్య కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ దంపతులు, కూతురు శాంతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకొని ఆసుపత్రికి వచ్చిన రామయ్య నరసమ్మపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు రామయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
News April 19, 2026
కర్నూలు జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానం, సెకండియర్‌లో ఎనిమిదో స్థానం నిలిచిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో 22,477 మందికి 16,356 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 18,999 మందికి 16,077 మంది పాసయ్యారు. 2,922 మంది ఫెయిలయ్యారు. సెకండియర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.


