News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.