News April 30, 2024
అత్యధిక మెజార్టీ నామాదే

ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటివరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.
Similar News
News March 15, 2026
విద్యుత్ పునరుద్ధరణకు ‘ఎమర్జెన్సీ’ వాహనాలు: ఎస్ఈ

ఖమ్మం: ప్రకృతి విపత్తులు, సాంకేతిక కారణాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు జిల్లాలో 5 ‘ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్’ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. వీటితో పాటు సబ్ డివిజన్ స్థాయిలో 13 వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. GPRS సౌకర్యం ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదుల కోసం 1912 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.
News March 15, 2026
BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News March 15, 2026
ఖమ్మం: యుద్ధ మేఘాలు.. వంట గదిలో మంట

అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు సామాన్యుడి వంట గదిపై పెనుభారం మోపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల క్రితం రూ.155 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 180కు, రూ. 110 ఉన్న పామాయిల్ రూ.135కు చేరింది. వేరుశనగ, కొబ్బరి నూనెల ధరలు కూడా భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


