News February 11, 2026

T20 WCలో ప్రపంచ రికార్డు

image

UAEతో మ్యాచులో ఊచకోత కోసిన న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్, అలెన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. తొలి వికెట్‌కు 175* పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం జోడించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ పార్ట్‌నర్ షిప్ కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో హేల్స్-బట్లర్(170*-ఇంగ్లండ్), రొస్సో-డికాక్(168-దక్షిణాఫ్రికా), సంగక్కర-జయవర్ధనే(166-శ్రీలంక), గుర్బాజ్-జర్దాన్(154-అఫ్గానిస్థాన్) ఉన్నారు.

Similar News

News February 19, 2026

ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

image

ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కాల్సిన మూవీ రద్దయిందన్న ప్రచారంలో నిజం లేదని సినీవర్గాలు తెలిపాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి-2’తో బిజీగా ఉన్నారని, అవి పూర్తయ్యాక ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు వర్మ ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తీసేందుకు సిద్ధమయ్యారు. రిషబ్ శెట్టి నటిస్తున్న ఆ సినిమా పూజా కార్యక్రమం ఈనెల 22న హంపీలో జరగనుంది.

News February 19, 2026

స్టేట్ రెవెన్యూ గ్రోత్‌లో 22వ స్థానంలో ఏపీ: జగన్

image

AP: GDP, GSDPపై చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘2024-25లో ₹1,19,927Cr ఆదాయం వస్తుందన్నారు. కానీ వచ్చింది ₹94,937Cr. ఇక 2026-27కు ₹1,37,320Cr ఆదాయం వస్తుందని చెప్పారు. ఇప్పటికన్నా 45% అధిక ఆదాయం సాధ్యమా? ఆదాయంలో కేంద్ర పురోగతి 9.64% ఉంటే AP పురోగతి 1.97%. స్టేట్ రెవెన్యూ గ్రోత్‌లో AP 22వ స్థానంలో ఉంది. CBN అసమర్థతకు ఇదే నిదర్శనం’ అని విమర్శించారు.

News February 19, 2026

స్మోకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందా?

image

సిగరెట్ తాగితే స్ట్రెస్ తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది అపోహ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లలోని నికోటిన్ వల్ల డోపమైన్ రిలీజ్ అయి కాసేపు ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుందని, దాని ప్రభావం తగ్గగానే మళ్లీ స్మోక్ చేయాలనిపిస్తుందని అంటున్నారు. ధూమపానం వల్ల దీర్ఘకాలంలో అసహనం, ఆందోళన, చిరాకు పెరుగుతాయంటున్నారు. ఊపిరితిత్తుల సమస్యలూ వస్తాయని, స్మోకింగ్ మానేయడం మంచిదని సూచిస్తున్నారు.