News April 30, 2024

కూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

image

✒ బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం; బీసీ సబ్‌ప్లాన్ కింద రూ.1.50 లక్షల కోట్ల ఖర్చు
✒ ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్
✒ సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20వేల సాయం
✒ చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
✒ పాడి పరిశ్రమకు ప్రత్యేక రుణాలు
✒ దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల జీతం.. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్

Similar News

News March 5, 2026

మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

image

AP: కృష్ణా(D) గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. HYDకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే నిలిపేశారు. ఈ ఫ్లైట్‌లో మంత్రి గొట్టిపాటి రవి, MLAలు లక్ష్మీనారాయణ, పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రోడ్డు మార్గాన బయలుదేరగా ఇతరులకు వేరే విమానం ఏర్పాటు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.

News March 5, 2026

ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

image

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.

News March 5, 2026

ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్‌కు గుడ్‌న్యూస్!

image

హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో INDతో పాటు మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభించింది. త్వరలోనే మన షిప్స్ రవాణా మొదలవ్వొచ్చు. ఇక తమ నౌకాదళంతో హార్ముజ్‌లోని వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకుందని, US, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పింది.