News April 30, 2024
ప్రచారం మధ్యలో సొమ్మసిల్లి పడిపోయిన సంధ్యారాణి

మక్కువ మండలంలోని పెద్ద ఊటగడ్డ గ్రామంలో సాలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేశారు. ఎండ ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పార్టీ శ్రేణులు అర్ధాంతరంగా ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. అనంతరం సంధ్యారాణిని సాలూరుకు తరలించారు.
Similar News
News March 15, 2026
ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్

రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత, వడగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం పని చేయకుండా ఉండాలని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లబరచి అవసరమైతే సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
News March 14, 2026
పదో తరగతి కేంద్రాల వద్ద 144 సెక్షన్: VZM కలెక్టర్

జిల్లాలో ఈ నెల 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు మొత్తం 119 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు, 631 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, ‘నో ఫోన్ జోన్’ అమల్లో ఉంటుంది. విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు.
News March 14, 2026
కొత్తవలస: యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి

కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ కంపెనీకి చెందిన లారీ డ్రైవరు బొగ్గు లోడింగ్ కోసం కంటకాపల్లి రైల్వే సైడింగ్‌కు వచ్చాడు. లారీ డ్రైవరు లారీకి టార్పాలిన్ కడుతూ ఉండగా జారిపోయి పడిపోయాడు. ఆ సమయంలో అటుగా మరోలారీ రావడంతో ఆ లారీ కిందపడి మృతి చెందాడు.


