News April 30, 2024
100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15,000 పెన్షన్: చంద్రబాబు

AP: ఏప్రిల్ నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘దివ్యాంగులకు రూ.6,000, 100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15,000, కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్థులకు రూ.10,000 పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎవరికీ రద్దు చేయం’ అని తెలిపారు.
Similar News
News January 25, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. అటు పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది.
News January 25, 2026
ఈరోజు మాంసాహారం తింటున్నారా?

నేడు సూర్యుడి జన్మదినం. ఈ రథసప్తమి ఆయనకు ప్రీతికరమైన ఆదివారంతో కలిసి వచ్చింది. అందుకే కొన్ని నియమాలు తప్పక పాటించాలంటున్నారు పండితులు. నేడు మాంసం తినడం, మద్యం తీసుకోవడం, జుట్టు/గోర్లు కత్తిరించుకోవడం అశుభమని హెచ్చరిస్తున్నారు. సూర్యుడిని ఆరాధిస్తూ ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారని చెబుతున్నారు. ఆదివారం నాడు నాన్‌వెజ్ ఎందుకు తినకూడదో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 25, 2026
ఆదివారం రోజున మాంసాహారం తింటున్నారా?

ఆదివారమొస్తే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాలు అది తప్పని చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సూర్యుడికి అంకితమైన రోజు. ఆయన ఆరోగ్యానికి, సాత్విక శక్తికి కారకుడు. ‘స్త్రీ తైల మధు మాంసాని రవివారే విసర్జయేత్’ అనే శ్లోకం ప్రకారం ఈరోజు మాంసం తినకూడదు. ఇది మన శరీరంలో తామస గుణాన్ని పెంచుతుంది. సూర్యుని సాత్విక శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆత్మశుద్ధి, దీర్ఘాయువు కోసం ఈ నియమాలు పాటించాలి.


