News February 11, 2026
GWL: నేడు పాఠశాలలకు సెలవు-డీఈవో విజయలక్ష్మి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు నేడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో విజయలక్ష్మి మంగళవారం రాత్రి ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖ నుంచి ఎక్కువ మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నందున సెలవు ప్రకటించామన్నారు. ఈనెల 14న రెండో శనివారం యథావిధిగా పాఠశాలలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 4, 2026
రూ.246కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపు : సీతక్క

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.246కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా మొత్తాన్ని చెల్లింపు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలలో గరిష్టంగా రూ.2లక్షల వరకు బీమా కవరేజీ ఇస్తున్నట్లు చెప్పారు. 2024నుంచి ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద రూ.23.1కోట్లు, లోన్ బీమా కింద రూ.223.7కోట్లు చెల్లించిందని మంత్రి వెల్లడించారు.
News March 4, 2026
పాలమూరు:జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✔ఘనంగా హోలీ వేడుకలు
✔తుమ్మన్‌పేటతో విడదీయలేని అనుబంధం: హీరో విజయ్ దేవరకొండ
✔జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు:SP
✔పాలమూరు: డ్రంక్ అండ్ డ్రైవ్.. 5 మంది డ్రైవర్లకు జైలు శిక్ష
✔జడ్చర్ల: మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు
✔పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
✔శరవేగంగా మహబూబ్‌నగర్ – దేవరకద్ర రైల్వే పనులు
✔చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత
News March 4, 2026
హోసన్నా మినిస్ట్రీస్ సభలకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

గుంటూరులో నిర్వహించనున్న హోసన్నా మినిస్ట్రీస్ సభలకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. విజయవాడ మీదుగా ప్రయాణించే నం.17258/17257 కాకినాడ పోర్ట్- VJA, నం.67229/67230 VJA- గుంటూరు రైళ్లను ఈ నెల 5, 8న 18 చైర్ కార్ కోచ్‌లతో నడుపుతామని తెలిపింది. ఆయా తేదీలలో ప్రయాణికుల రద్దీ మేరకు ఒక ట్రిప్‌ను 8 కోచ్‌ల మెము రైళ్లకు బదులు 18 చైర్ కార్ కోచ్‌లతో నడుపనున్నట్లు పేర్కొంది.


