News February 11, 2026
వనపర్తి : ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు…!

వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నేడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 64,190 మంది ఓటర్లు, పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 14,333 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 15 వార్డులకు 18,192 మంది, అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులకు 9,147 మంది, ఆత్మకూరు మున్సిపాలిటీలో 10 వార్డులకు 11,579 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News February 21, 2026
మామిడి: ఈ దశలో కాయ తొలిచే పురుగు ముప్పు మొదలు

మామిడి కాయలు నిమ్మ సైజు కంటే పెద్దవయ్యే దశ నుంచి కాయ తొలిచే పురుగులు కాయల తొడిమలు, రెండు కాయలు కలసి ఉన్నచోట గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పురుగులు కాయలను తొలిచి తింటూ అవి పగిలి, రాలి పోవడానికి కారణమవుతాయి. ఈ పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్(50 ఇ.సి) 1ml మరియు వేప మందు (10,000 ppm) 2ML కలిపి పిచికారీ చేయాలి. పండుఈగ కట్టడికి ఎకరాకు 8-10 మిథైల్ యూజీనాల్ ట్రాప్స్ అమర్చాలి.
News February 21, 2026
తిరుమలలో నిత్యం కల్యాణమే..

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.
News February 21, 2026
సంగారెడ్డి: అధికారులు సమన్వయంతో కృషి చేయాలని: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.


