News February 11, 2026

ప్రకాశం: మల్లన్న దర్శనాలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. పులి సంచారం

image

నల్లమల అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్తున్న భక్తులకు మంగళవారం పెద్దపులి కంటబడింది. పెచ్చేరువులో అన్నదాన శిబిరానికి సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులకు ఓ పెద్ద పులి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు తమ మొబైల్స్‌లో పెద్ద పులిని చిత్రీకరించారు. కాగా అభయారణ్యంలో కాలినడకన వెళ్లే భక్తులు జాగ్రత్తలు వహించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 18, 2026

పొదిలిలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా

image

పొదిలికి చెందిన కొదమల నాగరాజు అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్త మరొక యువతితో సంబంధం పెట్టుకుని తనని వేధిస్తున్నాడని దీంతో పుట్టింటికి వెళ్లానని భార్య తెలిపింది. భర్తలో మార్పు రాకపోతుందా అని తాను ఇంటికి రాగా.. మామ అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించింది. దీంతో ఆమె పిల్లలతో ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసింది.

News April 18, 2026

ఒంగోలు: మూడు జిల్లాల దొంగ అరెస్ట్

image

ప్రకాశం, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మల్లి రెడ్డి నరేంద్రరెడ్డి(27)ని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విజయ్ కృష్ణ, ఎస్ఐ హరిబాబు బృందం నిందితుడిని పట్టుకుని అతని నుంచి 110 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది. నరసరావుపేటలో తాకట్టు పెట్టిన బంగారం స్లిప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

News April 18, 2026

ప్రకాశం: రైతుల కోసం బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.