News February 11, 2026

నరసాపురం: తీరంలో అలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత

image

నరసాపురం, మొగల్తూరు సముద్ర తీర ప్రాంతాల్లో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తీరానికి వచ్చే ఈ తాబేళ్లు.. ఈ ఏడాది వరుసగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకురావడంతో తీరం వెంబడి దుర్వాసన వెదజల్లుతోంది. 

Similar News

News April 18, 2026

ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

image

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.

News April 18, 2026

మొగల్తూరు: వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

image

మొగల్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని గుబ్బల మావుళ్లు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను నిత్యం వెంబడిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి, ఈనెల 14న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మొగల్తూరు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

News April 18, 2026

బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

image

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.