News February 11, 2026
అల్లూరి: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

అల్లూరి, పోలవరం జిల్లాల్లో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని అధికారులు తెలిపారు.
Similar News
News February 12, 2026
మంచిర్యాల: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూములను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
News February 12, 2026
ADB: ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చూసుకోవాలి: SP

ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో దొంగతనాలు జరగకుండా ఉంటాయన్నారు. ఒక వేళ జరిగినప్పుడు వాటిని చేధించడంలో ఉపయోగపడతాయన్నారు. పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తుందన్నారు.
News February 12, 2026
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను, లబ్ధిదారులను ఆదేశించారు. గురువారం బెల్లంపల్లి డివిజన్‌లోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను ఎప్పటికప్పుడు జమ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.


