News February 11, 2026
‘వర్మ’ నెక్స్ట్ స్టెప్ ఏంటి?.. ‘హామీ’ దక్కేనా.. హ్యాండ్ ఇచ్చేనా?

2024 వరకు పిఠాపురంలో తిరుగులేని నేతగా వెలిగిన వర్మ, పవన్ కళ్యాణ్ రాకతో రాజకీయంగా అనిశ్చితిలో పడ్డారు. పవన్ విజయం కోసం త్యాగం చేసినా, జూన్ రాజ్యసభ రేసులో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. మకుటం లేని మహారాజుగా ఉన్న వర్మ తదుపరి కర్తవ్యం ఏమిటి? రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత దక్కుతుందా? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News February 12, 2026
కృష్ణా: పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్.. ఏఆర్ సిబ్బందికి శిక్షణ

ఏఆర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్‌లో భాగంగా మంగినపూడి బీచ్ వద్ద గల ఫైరింగ్ రేంజ్‌లో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ గురిని పరీక్షించుకున్నారు. విధి నిర్వహణలో ఆయుధాల వినియోగంపై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
News February 12, 2026
మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సోపిరాల, కొత్తపాలెం గ్రామాల్లోని దేవాలయాలను సందర్శించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామని, రైల్వే ట్రాక్ దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాఖల సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News February 12, 2026
ఏర్పేడు: ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తులు

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ -01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. మాస్టర్స్/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్, అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 15.


