News February 11, 2026
వికారాబాద్: తొలిసారి ఓటేసిన విద్యార్థిని

వికారాబాద్ జిల్లా ఆలంపల్లి గ్రామంలో ఓ విద్యార్థిని తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా ఆ బాలిక మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమవ్వడం గర్వంగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.
Similar News
News April 18, 2026
యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.
News April 18, 2026
ఏలూరుకి వస్తున్న ఎంపీ మహేష్

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ నెల 19న ఏలూరుకి రానున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అయితే ఇటీవల ఎంపీ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆయన తిరిగి ఏలూరుకి రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
News April 18, 2026
TU: నేటి నుంచే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డిగ్రీ(B.A/B.Com/B.Sc/BBA) 2, 4, 6 రెగ్యులర్, 1, 3, 5 బ్యాక్ లాగ్(2021-2025) సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.


