News April 30, 2024
వైసీపీకి కొత్త తలనొప్పిగా LTA
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ YCPకి కొత్త తలనొప్పిగా మారే అవకాశముంది. ఈ చట్టంతో భూముల హక్కుపై ప్రజల్లో భయాందోళనలున్నాయి. కానీ ప్రభుత్వం ఇస్తున్న వివరణలు వారి అనుమానాలు, ఆందోళనలు తగ్గించేలా లేవని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు వారసత్వంగా పొందే భూ పట్టా పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రించడంపై కొంత వ్యతిరేకత వస్తోంది. కడప జిల్లాలో YS భారతిని సైతం ప్రజలు ప్రశ్నించడంతో ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది.
Similar News
News December 29, 2024
నేను మరాఠీ.. నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నా: మంత్రి సత్యకుమార్
AP: తాను మరాఠీ అయినా తన పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని చెప్పారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘సంస్కృతి, వారసత్వం అన్ని భాషతోనే ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావడం లేదు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుంది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
News December 29, 2024
నితీశ్ కుమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
నితీశ్ కుమార్ రెడ్డి తెలుగువాడైనందుకు గర్వంగా ఉందని చాలా మంది పోస్టులు పెడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నువ్వు “భారత్”లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే దేశం గర్వించేలా ఏం చేశావన్నదే ముఖ్యం. ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులెన్నో సాధించాలని కోరుకుంటున్నా. భారత జెండాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.
News December 29, 2024
₹12 కోట్ల ఘరానా మోసం.. నిందితుల అరెస్టు
CRED యాప్‌ను పర్యవేక్షించే Dreamplug Paytech Solutions బ్యాంకు ఖాతాల నుంచి ₹12 కోట్లు లూటీ చేసిన నలుగురు నిందితులను బెంగళూరు సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. Axis బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్ వైభవ్ పిథాడియా బ్యాంకు, ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కలిసి క్రెడెన్షియల్స్ మార్పు, తప్పుడు పత్రాలతో Dreamplug ఖాతాల యాక్సెస్ పొందారు. 37 లావాదేవీల ద్వారా ₹12.20 కోట్లను ఇతర ఖాతాలకు మళ్లించారు.