News February 11, 2026

11-11-11 అంటూ వైసీపీ MLAలపై స్పీకర్ సెటైర్లు

image

AP: అసెంబ్లీ లాబీలో వైసీపీ MLAలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా వైసీపీ నేతలు సభ నుంచి <<19108172>>బయటకు<<>> వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై సభలో చర్చకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Similar News

News March 1, 2026

ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా!

image

ఇవాళ HYDలో బంగారం, వెండి ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,68,710, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.3,20,000 పలుకుతోంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రేపు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

News March 1, 2026

నాడు కత్తుల పోరు.. నేడు క్షిపణుల హోరు

image

పూర్వం రాజ్యాల కోసం రాజులు దండెత్తి, అమాయకులను బలితీసుకున్నారనే గాథలు విన్నాం. నేడు ఆధునిక ప్రపంచంలోనూ అదే క్రూరత్వం కనిపిస్తోంది. ఒకరిని అంతం చేసేందుకు దేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర దాడుల్లో పసిపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అభివృద్ధి చెందిన దేశాలు సైతం పాతకాలపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అమాయకుల రక్తంతో యుద్ధ క్షేత్రాన్ని తడపడం మానవత్వానికే తీరని మచ్చ.

News March 1, 2026

కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం

image

వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణకు రసాయనాలతో కూడిన కలుపు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. అనాలోచితంగా పంట భూములకు వీటిని వాడటం వల్ల కలుపుతో పాటు భూమిలో పంటకు మేలు చేసే జీవరాశి కూడా అంతమై, పంట పొలాలు నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు పోషకాలు అందవు. సాగు, తాగు నీటి వనరులు, నేల నిర్మాణం పాడైపోయే ముప్పు ఉంది. అందుకే వీటిని తప్పనిసరిగా నిపుణుల సూచనలతో అవసరమైతేనే వాడాలి.