News February 11, 2026

ఖానాపూర్‌లో అత్యధికం.. నిర్మల్‌లో అత్యల్పం

image

ఉదయం 11 గంటల వరకు నిర్మల్ జిల్లాలో సగటున 18.29 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 23.65 శాతం ఓటింగ్ జరగగా, భైంసాలో 21.34 శాతం నమోదైంది. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో మాత్రం ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 15.73 శాతంతో అత్యల్ప పోలింగ్ నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 30,540 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News February 22, 2026

భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం MOU

image

AP: భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News February 22, 2026

ఆసిఫాబాద్: ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

image

ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 23 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 5,847 మంది విద్యార్థులకు గాను 5,645 మంది హాజరైనట్లు DCO శారద తెలిపారు. 96 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు.

News February 22, 2026

HYD: అంగన్వాడీ.. ఊపిరాడని పనులతో ఉక్కిరిబిక్కిరి

image

ఊపిరిసలపని పనులతో అంగన్వాడీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. NHTS, పోషణ ట్రాకర్ యాప్‌లో గ్రోత్ మానిటరింగ్, డైలీ హాజరు, సర్వేలు, గృహ సందర్శనలు, MAM, SAM పిల్లలు, గర్భిణులు, బాలింతల మెడికల్ రికార్డులు, THR ఫొటోలు, ABHA, APAAR, CBE ఈవెంట్లు, ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలతో పాటు అదనంగా 10 రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. BLO డ్యూటీ, పల్స్ పోలియోతో పాటు పోషకాహార పంపిణీ, ప్రీ స్కూల్ బోధనతో సతమతమవుతున్నారు.